తూర్పుగోదావరి జిల్లా కొత్తపేటలోని వాసవీ మాతా ఆలయంలో లక్ష్మీ నరసింహ స్వామి హోమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వివేకానంద కేంద్ర-కన్యాకుమారి సంపర్క ప్రముక్ సదాశివ పాల్గొన్నారు. హిందూ సాంప్రదాయలు కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. అన్యాయంగా అంతర్వేది రథాన్ని దగ్ధం చేసిన దుండగులను పట్టుకోవడంలో ప్రభుత్వం విఫలం అయ్యిందని విమర్శించారు.
ఘనంగా లక్ష్మీ నరసింహస్వామి హోమం
తూర్పుగోదావరి కొత్తపేటలోని వాసవీ మాతా ఆలయంలో లక్ష్మీనరసింహ స్వామి హోమాన్ని ఘనంగా నిర్వహించారు. భాజపా రాష్ట్ర యువ మోర్చా విభాగం ఉపాధ్యక్షుడు పాలూరి జయ ప్రకాష్ నారాయణ పర్యవేక్షణలో ఈ వేడుక జరిగింది.
ఘనంగా లక్ష్మీనరసింహ స్వామి హోమం