తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో కుడుపూడి బ్రదర్స్ సంస్థ ఆధ్వర్యంలో రోజూ 500 మందికి భోజనాలు అందజేస్తున్నారు. సరుకులు తరలించే వాహనదారులకు, యాచకులకు, నిరాశ్రయులుకు నిత్యం ఆహారం పంపిణీ చేస్తున్నారు. ఇవాళ ఈ కార్యక్రమానికి కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి హాజరై అన్న వితరణ చేశారు. కుడుపూడి సంస్థ ప్రతిరోజు ఇలా సేవా కార్యక్రమాలు చేయడం హర్షించదగినదని అభినందించారు.
'కుడుపూడి బ్రదర్స్ సేవా గుణం అభినందనీయం' - కరోనా వేళ రావులపాలెంలో పేదలకు కుడుపూడి బ్రదర్స్ సహాయం
లాక్ డౌన్ నేపథ్యంలో ఇబ్బందులు పడుతున్న పేద ప్రజలకు ప్రతిరోజూ ఆహారం పంపిణీ చేయడం అభినందనీయమని.. తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి అన్నారు.
!['కుడుపూడి బ్రదర్స్ సేవా గుణం అభినందనీయం' kudupudi brothers distribute food to poor people at raavulapalem east godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6852334-855-6852334-1587279384348.jpg)
వాహనదారులకు ఆహారం అందిస్తున్న కుడుపూడి బ్రదర్స్