తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడిలో ఉత్సాహంగా మెుదలైన అంతర జిల్లా జూనియర్స్ ఖోఖో పోటీలు అంతే ఉత్సాహంగా ముగిశాయి. ఫైనల్స్‌లో ప్రకాశం జిల్లా అబ్బాయిల జట్టు విజయం సాధించగా, తూర్పు గోదావరికి చెందిన అమ్మాయిల జట్టు విజేతగా నిలిచింది. విజయనగరం జిల్లా రెండు జట్లు రన్నరప్‌గా నిలిచాయి. విజేతలకు ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు బహుమతులు అందజేశారు. గత నాలుగు సంవత్సరాలుగా ప్రకాశం జిల్లా అబ్బాయిల జట్టే విజేతగా నిలుస్తూ రావటంతో ఆ జిల్లా క్రీడాకారులు ఆనందం వ్యక్తం చేశారు.
నాలుగోసారీ ప్రకాశం జిల్లాకే బహుమతి!
తూర్పుగోదావరి జిల్లా కిర్లంపూడిలో నిర్వహిస్తున్న అంతర జిల్లా జూనియర్స్ ఖోఖో పోటీలు ఉత్సాహంగా ముగిశాయి.
kho-kho finals winner prakashm district boys team