సెప్టెంబర్ 15న తూర్పు గోదావరి జిల్లా కచ్చులూరు వద్ద గోదావరిలో మునిగిపోయిన రాయల్ వశిష్ఠ బోటును 38 రోజుల తర్వాత బయటకు తీయగలిగారు. కాకినాడకు చెందిన నిపుణుడు ధర్మాడి సత్యం బృందం, విశాఖకు చెందిన డైవర్లు శ్రమించి ఎట్టకేలకు బోటును ఒడ్డుకు చేర్చారు. ఈ దిశగా.. ధర్మాడి సత్యం బృందం రెండు దఫాలుగా ప్రయత్నించింది. ఇవాల్టికి వారి శ్రమ ఫలించింది. బోటు ఫ్యానుకు రోప్‌లు గట్టిగా బిగించిన తర్వాతే బయటకు తీయగలిగామని ధర్మాడి సత్యం తెలిపారు. కొన్ని రోప్‌లు తెగిపోయినా శ్రమించి ఫలితం సాధించామన్నారు. బోటు బయటకు వచ్చినందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పారు. వెలికితీతలో అధికారులు సహకరించారని ప్రశంసించారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు సంతాపం తెలిపారు.
బోటు వెలికితీతపై ఆనందం.. బాధిత కుటుంబాలకు సంతాపం
గోదావరి నదిలో కచ్చులూరు వద్ద మునిగిపోయిన రాయల్ వశిష్ఠ బోటును ధర్మాడి సత్యం బృందం, విశాఖకు చెందిన డైవర్లు శ్రమించి ఇవాళ బయటకు తీశారు. బోటు ఫ్యానుకు రోప్ బలంగా బిగించడం వల్లే బయటకు తీయగలిగామని సత్యం తెలిపారు.
ఎట్టకేలకు బోటు బయటకు... ఫలించిన ధర్మాడి బృందం శ్రమ