తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడిలో ఆంధ్ర ప్రదేశ్ అంతర్ జిల్లాల జూనియర్స్ కబడ్డీ ఛాంపియన్ షిప్ 2021 పోటీలను ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు ప్రారంభించారు. ఈ పోటీల్లో 13 జిల్లాలకు చెందిన 26 బాల బాలికల జట్లు తలపడనున్నాయి. అంతకుముందు వివిధ జిల్లాల నుంచి వచ్చిన 500 మంది క్రీడాకారులతో లాంగ్ మార్చ్ నిర్వహించారు.
కిర్లంపూడిలో అంతర్ జిల్లాల జూనియర్ కబడ్డీ పోటీలు ప్రారంభం - తూర్పు గోదావరి జిల్లా జూనియర్ కబడ్డీ ఆటలు
తూర్పు గోదావరి జిల్లాలో జూనియర్స్ కబడ్డీ ఛాంపియన్ షిప్ను ఎమ్మెల్యే జ్యోతుల చంటి బాబు ప్రారంభించారు. కాసేపు క్రీడాకారులతో కబడ్డీ ఆడి అలరించారు.
Breaking News
అనంతరం ఎమ్మెల్యే జాతీయ జెండాను, రాష్ట్ర క్రీడల జెండాను ఎగురవేశారు. టాస్ వేసి తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాల బాలుర జట్ల ప్రారంభ మ్యాచ్ ప్రారంభించారు. కొద్దిసేపు ఎమ్మెల్యే వారితో కబడ్డీ అడి అలరించారు.
ఇదీ చదవండి:'జగన్ను చూస్తే సొంత మనవడిని చూసినట్లుంది'