ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దిల్లీ రైతుల ఉద్యమానికి మద్దతుగా... - శ్రీకాకుళం జిల్లాలో దిల్లీ రైతుల ఉద్యమానికి మద్దతు

దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనలకు సంఘీభావంగా శ్రీకాకుళం, విజయవాడల్లో ఆందోళనలు నిర్వహించారు. శ్రీకాకుళంలో ఏడు రోడ్ల కూడలిలో సీఐటీయూ ఆధ్వర్యంలో రోడ్డు దిగ్భంధించారు. అఖిల భారత రైతంగ పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు.

In support of the Delhi peasant movement
దిల్లీ రైతుల ఉద్యమానికి మద్దతుగా...

By

Published : Jan 8, 2021, 4:45 PM IST

  • శ్రీకాకుళంలో...

దిల్లీలో రైతులు చేస్తున్న నిరసనలకు సంఘీభావంగా శ్రీకాకుళంలో ఏడు రోడ్ల కూడలిలో సీఐటీయూ ఆధ్వర్యంలో రోడ్డు దిగ్భంధించారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్​లు, మూడు వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ బిల్లు రద్దు చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఆందోళనకారులను పోలీసులు అరెస్ట్ చేసి పోలీస్​ స్టేషన్​కు తరలించారు.

  • విజయవాడలో..

కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన రైతు వ్యతిరేక వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సంస్కరణల బిల్లును రద్దు చేయాలని.. అఖిల భారత రైతంగ పోరాట సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో విజయవాడలో రాష్ట్ర సదస్సు నిర్వహించారు. దిల్లీలో రైతులు విజయం సాధించాలని కోరారు. దిల్లీలో 44 రోజులుగా సాగుతున్న రైతుల ఉద్యమం చరిత్రలో నిలిచిపోతుందని రైతు సంఘం నాయకులు ఇండ్ల ప్రభాకర్ రెడ్డి అన్నారు.

ABOUT THE AUTHOR

...view details