తూర్పుగోదావరి జిల్లా కోనసీమలో అకాల వర్షానికి పంటలు దెబ్బతిన్నాయి. కొత్తపేట నియోజకవర్గంలో ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వాన కురిసింది. దీంతో కల్లాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దయ్యింది. ఆరుగాలం శ్రమించి పండించిన పంట నీళ్లలో నానటంతో అన్నదాతల ఆవేదన చెప్పలేని విధంగా ఉంది.
వానకు తడిసిన ధాన్యం.. అన్నదాత పరిస్థితి దైన్యం - కొత్తపేటలో వర్షానికి పంట నష్టం
అకాల వర్షం అన్నదాతకు అపార నష్టాన్ని మిగిల్చింది. ఒక్కసారిగా కురిసిన వర్షానికి ధాన్యం తడిసిపోయింది. నీళ్లలో నానుతున్న పంటను చూసి రైతులు ఆవేదన చెందుతున్నారు.
![వానకు తడిసిన ధాన్యం.. అన్నదాత పరిస్థితి దైన్యం heavy rain at kottapet paddy damaged in east godavari district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6993966-110-6993966-1588179094879.jpg)
వానకు తడిసిన ధాన్యం