తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట సబ్‌జైలులో.. హెడ్‌కానిస్టేబుల్ గుండెపోటుతో మృతి చెందారు. విధి నిర్వహణలో ఉండగానే సత్యనారాయణ మూర్తి (59) అనే హెడ్‌కానిస్టేబుల్ గుండెపోటుకు గురయ్యారు. రాజమహేంద్రవరం ఆస్పత్రికి తరలిస్తుండగా దారిలోనే ప్రాణాలు విడిచారు.
Heart Attack: విధి నిర్వహణలో ఉన్న హెడ్‌కానిస్టేబుల్.. గుండెపోటుతో మృతి - గుండెపోటుతో విధి నిర్వహణలో ఉన్న హెడ్‌కానిస్టేబుల్ మృతి వార్తలు
గుండెపోటుతో హెడ్‌కానిస్టేబుల్ మృతి
16:59 August 14
గుండెపోటుతో హెడ్‌కానిస్టేబుల్ మృతి
పి.గన్నవరం పోలీసు స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్‌గా ఉన్న సత్యనారాయణ మూర్తి..కొత్తపేట సబ్ జైలులో గార్డుగా విధులు నిర్వహించారు. 1990లో కానిస్టేబుల్‌గా ఉద్యోగ బాధ్యతలు స్వీకరించిన సత్యనారాయణకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఆయన మృతిపై సబ్‌జైలు అధికారులు, పి. గన్నవరం పోలీసులు సంతాపం తెలిపారు.
ఇదీ చదవండి:
నెల్లూరు జిల్లాలో విషాదం.. ప్రియుడి మృతి తట్టుకోలేక ప్రియురాలు ఆత్మహత్య
Last Updated : Aug 14, 2021, 7:50 PM IST
TAGGED:
head constable died