'కాతేరు'ను ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేయాలి - government funds should be use for development of kateru village
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం కాతేరులో ఎంపీ మార్గాని భరత్ రామ్, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కలిసి పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. సీఎం జగన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని ఎంపీ భరత్ రామ్ కేక్ కట్ చేశారు. కాతేరు గ్రామాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. కాతేరు పంచాయతీని రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్లో విలీనం చేయడం వల్ల... ఈ గ్రామం అభివృద్ధి చెందుతుందన్నారు . ఈ పంచాయతీని ప్రభుత్వ నిధులతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అభిప్రాయపడ్డారు.
కాతేరులో పలు అభివృద్ధి పనులకు సంబంధించి శిలాఫలకాలు ఆవిష్కరణ