రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో గ్రామాల విలీన ప్రక్రియ నిలిచిపోయినందున ఆయా గ్రామాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని.. తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి అన్నారు. నగరసంస్థ పరిధిలో 21 గ్రామాలను విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించడం... ఆ ప్రక్రియ ఆలస్యమవుతున్నందున ఆయా గ్రామాల్లో నీటి సరఫరా, వీధి దీపాల నిర్వహణతో పాటు పారిశుద్ధ్యం అధ్వాన్నంగా మారిందన్నారు. వెంటనే విలీన గ్రామాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. స్పందన కార్యక్రమంలో కమిషనర్ అభిషిక్త్ కిషోర్‌కు వినతిపత్రం అందజేశారు.
'విలీన ప్రక్రియలో జాప్యం.. గ్రామాల నిర్వహణ అస్తవ్యస్తం' - రాజమహేంద్రవరంలో గోరంట్ల బుచ్చయ్యచౌదరి
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ పరిధిలో 21 గ్రామాల నిర్వహణ అస్తవ్యస్తంగా మారిందని తెదేపా సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. విలీన ప్రక్రియ ఆలస్యమవడమే అందుకు కారణమన్నారు.
గోరంట్ల బుచ్చయ్య చౌదరి