కోనసీమ తిరుపతిగా పేరుగాంచిన తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. స్వామి వారిని గరుడ వాహనంపై ఊరేగించారు. ఉత్సవ విగ్రహాలకు వేదపండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి, మలయప్ప అలంకరణలో గరుడ వాహనంపై ఊరేగించారు. కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి దంపతులు, దేవస్థాన చైర్మన్ రమేష్ రాజు, కార్యనిర్వహణ అధికారి ముదునూరు సత్యనారాయణ రాజులు, భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి ఊరేగింపులో పాల్గొన్నారు. అనంతరం ఆలయంలో స్వామివారికి ఎమ్మెల్యే కుటుంబసభ్యులు ప్రత్యేక పూజలు చేశారు.
గరుడ వాహనంపై ఊరేగిన వాడపల్లి వెంకన్న - vadapalli venkateswara swamy temple latest news
వాడపల్లి వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మలయప్ప స్వామి ఆలంకరణలో గరుడ వాహనంపై స్వామి వారిని ఊరేగించారు. స్వామి అమ్మవార్లకు ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
గరడు వాహనంపై ఊరేగిన వాడపల్లి వెంకన్న
ఇవీ చూడండి...