జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని తూర్పు గోదావరి జిల్లాలోని పలు చోట్ల ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి వేడుకలు నిర్వహించారు. రాజమహేంద్రవరం దానవాయిపేట చిన్న గాంధీబొమ్మ సెంటర్లో నూతన గాంధీ విగ్రహాన్ని... నగర ఎమ్మెల్యే భవాని విగ్రహాన్ని ఆవిష్కరించారు. సత్యం అహింస పట్ల ఆయన నిబద్ధతను మనలో అలవర్చుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
రాజమహేంద్రవరంలో ఘనంగా మహాత్ముని జయంతి వేడుకలు
మహాత్ముని జయంతిని పురస్కరించుకుని తూ.గో జిల్లాలోని పలుచోట్ల ప్లాస్టిక్‌పై అవగాహన కల్పించారు. మరి కొన్నిచోట్ల మొక్కలు నాటారు. దానవాయిపేటలో ఎమ్మెల్యే భవాని గాంధీ విగ్రహాన్ని ఆవిష్కరించారు.
రాజమహేంద్రవరంలో ఘనంగా మహాత్ముని జయంతి వేడుకలు
మహాత్ముని జయంతి సందర్భంగా రాజమహేంద్రవరం గ్రామీణ మండలం కొంతమూరు ఎస్తేర్ ఎక్జీన్ రెసిడెన్షియల్ ఎయిడెడ్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు మొక్కలు నాటారు. సీఆర్పీఎఫ్ 42 బెటాలియన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. 42వ బెటాలియన్ కమాండెంట్ సతీష్ కుమార్ మొక్కలు నాటి నీళ్లు పోశారు. మొక్కలను సంరక్షించాలని విద్యార్థులకు సూచించారు.