తూర్పుగోదావరి జిల్లా రంపచోడవరం మండలం బీరంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో అడ్డతీగల రేంజ్లో డిప్యూటీ రేంజ్ అధికారిగా విధులు నిర్వర్తిస్తున్న ఎర్రయ్య దొర అక్కడికక్కడే మృతి చెందారు. రంపచోడవరం ఐటీడీఏలో జరిగే సమావేశానికి హాజరై.. తిరిగివస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రోడ్డు ప్రమాదంలో అటవీ అధికారి మృతి - తూర్పుగోదావరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో అటవీ అధికారి మృతి
రోడ్డు ప్రమాదంలో అటవీ అధికారి మృతి చెందిన ఘటన తూర్పుగోదావరి జిల్లా బీరంపల్లి వద్ద జరగింది. ఆర్టీసీ బస్సు, ద్విచక్రవాహనం ఢీకొన్న ఘటనలో ఎర్రయ్య దొర అనే అధికారి ప్రాణాలు కోల్పోయారు.
రోడ్డు ప్రమాదంలో అటవీ అధికారి మృతి