తూర్పుగోదావరి జిల్లా రాజానగరంలో నిరుపేదలకు రెండుపూటలా భోజనం పెడుతోంది మాతృభూమి సేవా సంస్థ. ప్రతిరోజూ వారి ఆకలి తీరుస్తూ ఆదుకుంటోంది. రాజమహేంద్రవరానికి చెందిన ఈ సంస్థ రోజూ ఆహారం తయారుచేసి రోడ్లమీద ఉండేవారికి అందజేస్తోంది. వలస కూలీలు, పేదలకు అన్నం పెడుతోంది.
అన్నార్తుల ఆకలి తీరుస్తున్న 'మాతృభూమి' - రాజమహేంద్రవరంలో ఆహారం పంపిణీ
కరోనా నేపథ్యంలో విధించిన లాక్ డౌన్ చాలామందిని పస్తులుంచుతోంది. రోజు కూలీలు, అనాథలు, యాచకులు ఆహారానికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అలాంటివారికి అన్నం పెడుతూ ఆదుకుంటోంది మాతృభూమి ఫౌండేషన్.
అన్నార్తుల ఆకలి తీరుస్తున్న 'మాతృభూమి'