తూర్పుగోదావరి జిల్లా నదీ పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాలతో నదిలోకి భారీగా వరద నీరు చేరుతోంది. దీనితో గోదావరిలో క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 10.4 అడుగుల నీటిమట్టం ఉంది. లక్ష 8వేల క్యూసెక్కుల నీరు బ్యారేజీకి చేరింది. తూర్పు, మధ్య, పశ్చిమ డెల్టా కాల్వలకు సుమారు 8వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. మిగతా వరదనీరును సముద్రంలోకి విడిచిపెడుతున్నారు.
గోదావరిలో పెరుగుతున్న వరద ప్రవాహం ... డెల్టా కాల్వలకు నీటి విడుదల
తూర్పుగోదావరి జిల్లా గోదావరిలో క్రమంగా వరద ప్రవాహం పెరుగుతోంది. ధవళేశ్వరం ఆనకట్ట వద్ద 10.4 అడుగుల నీటిమట్టం ఉంది. లక్ష 8వేల క్యూసెక్కుల నీరు బ్యారేజీకి చేరింది.
గోదావరిలో పెరుగుతోన్న వరద ప్రవాహం