గత పదిరోజులుగా తూర్పు గోదావరి జిల్లా లంకగ్రామాలను అతలాకుతలం చేసిన వరద తగ్గుముఖం పట్టింది. ముక్తేశ్వరం జీ పెదపూడి వద్ద కాజువేలు ముంపు నుంచి బయటపటంతో అప్పనపల్లి కాజ్వే ,కే ఏనుగుపల్లి రహదారుల పై వరద నీటి ప్రవాహం తగ్గింది. చాకలి పాలెం సమీపంలోని కాజ్వే,శివలంక లు ఇంకా వరదనీటిలోనే ఉన్నాయి. కనకాయలంక.బూరుగులంక,ఉడుముడి లంక,అరిగెలవారిపేట, జీ పెదపూడి లంక గ్రామాల ప్రజలు మర పడవలతో రాకపోకలు సాగిస్తున్నారు. అంతేగాక ఇక్కడి నది పాయల్లో అక్టోబర్ వరకు వరద నీరు ప్రవహిస్తుంది. అప్పటి వరకు ఇబ్బందులు తప్పవని ప్రజలు అంటున్నారు.
వరద పోటు తగ్గడంతో లంక గ్రామాలకు ఉపశమనం - తూర్పుగోదావరి జిల్లా
వర్షాలు తగ్గడంతో వరద గోదావరి శాంతించింది. దీంతో లంకగ్రామాల ప్రజలు కాస్త ఊపిరి పీల్చుకుంటున్నారు. రోజువారి కార్యకలపాల కోసం ప్రజలు రోడ్లపైకి రావడంతో జనజీవనం సందడిగా కనిపిస్తోంది.
flood flow is decreasing at lanka villages in east godavari district