చేపల వేట ముగిసిన జూలై, ఆగస్టు నెలలో జీవనోపాధి కల్పించాలని కోరుతూ ఏడీ శ్రీనివాసరావుకు జాలర్లు వినతిపత్రం అందజేసారు. తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం జలాశయానికి చెందిన సుమారు ఐదు వందల మంది జాలర్లు.. ఈ మేరకు తమ సమస్యలను వినతిపత్రంలో వివరించారు. ఉపాధి లేని సమయంలో.. కుటుంబం గడవడం కష్టంగా ఉందంటూ.. స్థానిక ఎమ్మెల్యే పర్వత పూర్ణచంద్రప్రసాద్ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే సహాయాన్ని తప్పకుండా అందేలా చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. వేట విరామ సమయాన్ని ఖచ్చితంగా పాటించాలని జాలర్లకు సూచించారు.
జీవనోపాధి కల్పించాలని జాలర్ల వినతి పత్రం
చేపల వేట విరామ సమయంలో జీవనోపాధి కల్పించాలని కోరుతూ ఏలేశ్వరం జలాశయానికి చెందిన జాలర్లు... మత్స్యశాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు.
fishermans gave notice to fisheries department at eastgodavari district