తనతో వ్యక్తిగత వివాదం ఉన్న వ్యక్తి నుంచి భారీగా డబ్బు గుంజేందుకు పెద్ద ప్లానే వేశారు.. దుర్గారెడ్డి అండ్ బ్యాచ్. ఓ మహిళను ఎరగా వేసి భారీగా దండుకునేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ ఓ ముుఠా గుట్టును..రట్టు చేశారు.. తూర్పుగోదావరి పోలీసులు...! మామిడాడకు చెందిన మణికంఠరెడ్డి ఫైనాన్స్ వ్యాపారం చేస్తుంటాడు. కాకినాడకు చెందిన దుర్గారెడ్డి ఓ ప్రైవేట్ ఛానల్ నడుపుతున్నాడు. వారిద్దరి మధ్య స్థలవివాదాలున్నాయి. ఎలాగైనా మణికంఠరెడ్డిని దెబ్బతీయాలనే ఉద్దేశంతో దుర్గారెడ్డి, రాజేష్ అనే వ్యక్తులు పథకం రచించారు. ముఠాలోని ఒక వ్యక్తి భార్యను మణికంఠరెడ్డికి పరిచయమయ్యేలా చరవాణి, సందేశాలను ఆమెతో చేయించారు. ఈ క్రమంలో మణికంఠరెడ్డి, ఆ మహిళ మధ్య పరిచయం పెరిగింది. ఈనెల ఏడోతేదీన సామర్లకోటలోని మడికి అశోక్ అనేవ్యక్తి ఇంటికి మణికంఠరెడ్డిని రప్పించారు. ఆ ఇంట్లో మహిళతో మణికంఠరెడ్డి ఏకాంతంగా ఉన్నప్పుడు వారిని ఫొటోలు, వీడియోను ముఠా సభ్యులు తీశారు. ఆతర్వాత గదిలోకి ప్రవేశించి మణికంఠరెడ్డిని కుర్చీకి కట్టేసి కొట్టి రూ.25 లక్షల నగదు ఇవ్వాలని డిమాండ్ చేసి అతని వద్ద ఉన్న రూ. 63 వేల నగదు, బంగారు గొలుసు, బ్రాస్లెట్, ఉంగరాలను లాక్కున్నారు. ప్రాంసరీ నోట్లు, తెల్ల కాగితంపై సంతకాలు, వేలిముద్రలు తీసుకున్నారు. ఈ విషయమై బాధితుడు మణికంఠరెడ్డి అదేరోజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు..
అమ్మాయితో వలవేశారు.. అడ్డంగా బుక్కయ్యారు...
మహిళను అడ్డపెట్టుకుని పెద్ద మొత్తంలో సొమ్ములు గుంజేందుకు ప్రయత్నించింది.. ఓ ముఠా..! ఆ ప్రయత్నంలో విజయవంతం అయింది కూడా.. ! అయితే బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో మోసపు ముఠా ఊచల వెనక్కువెళ్లక తప్పలేదు.
trap
ముఠా అరెస్ట్
కేసునమోదు చేసి దర్యాప్తు చేసిన సామర్లకోట పోలీసులు గురువారం నిందితులైన మహిళ, ఆరుగుళ్ల మహేష్, నిమ్మకాయల సతీష్, తోట సందీప్, బొడ్డుపు రాజ్‌కుమార్, ఎలుడుట్టి లక్ష్మీనారాయణ, మడికి అశోక్‌లను అదుపులోకి తీసుకున్నారని సీఐ వెల్లడించారు. సంఘటనకు కారకులైన దుర్గారెడ్డి, రాజేష్‌లు పరారీలో ఉన్నారని, వారికోసం గాలిస్తున్నట్లు పెద్దాపురం సీఐ శ్రీనివాస్ తెలిపారు.