కరోనా మహమ్మారి నుంచి రక్షించుకునేందుకు ఇప్పుడు అందరూ పాటిస్తున్న విధానం భౌతిక దూరం. అలాగే మాట్లాడేటప్పుడు తుంపర్లు పడకుండా, వైరస్ సోకకుండా ప్రతిఒక్కరూ మాస్కు ధరిస్తున్నారు. ఇది కట్టుకుని ఇతర వ్యక్తులకు దూరంగా ఉంటే వైరస్ సోకకుండా కాపాడుకోవచ్చు. అయితే.. నిత్యం రోగులతో దగ్గరగా మాట్లాడుతూ వారి శరీర భాగాలను తాకుతూ వైద్యులు చికిత్స అందించాలి. రోగి మాట్లాడేటప్పుడు అతని నోటి తుంపరలు వైద్యునిపై పడకుండా జాగ్రత్తపడాలి. ఈ సౌకర్యాన్ని అందించే సాధనమే ఫేస్ షీల్డ్. ప్రస్తుతం ఫేస్‌షీల్డ్ పరికరం వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ఇది ముఖాన్ని పూర్తిగా కప్పేస్తుంది. అదే సమయంలో ఎదుటి వ్యక్తి నోటి నుంచి వచ్చే తుంపర్లను అడ్డుకుటుంది. వీటికి వైద్యుల నుంచి గిరాకీ పెరిగింది.
రాజమహేంద్రవరంలో రైడర్‌షబ్ షాపు వీటిని విక్రయిస్తోంది. ఉభయగోదావరి జిల్లాల నుంచి ప్రకాశం వరకూ ఈ ఫేస్ షీల్డ్‌ను వైద్యులు ఎక్కువగా అడుగుతున్నారని నిర్వాహకులు తెలిపారు. మాస్క్ తో పోలిస్తే మరింత రక్షణ కలిగిస్తున్న కారణంగా సాధారణ ప్రజలూ వీటిని ధరించేందుకు మొగ్గు చూపుతున్నారు.