గోదావరిలో మునిగిపోయిన బోటులో 93 మంది ప్రయాణించారని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. తాను మాట్లాడే మాటలకు కట్టుబడి ఉన్నానని చెప్పారు. బోటు ఆపినపుడు దేవీపట్నం పోలీసులు తీసిన ఫోటోలు బయట పెట్టాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సుదీర్ఘ పాదయాత్ర చేసి తెలుసుకుంది ఏంటని ప్రశ్నించారు. కాకినాడ పోర్టు అధికారిని కాపాడేందుకు ప్రయతిస్తున్నారని ఆరోపించారు.
బోటు ప్రయాణికుల విషయంలో ప్రభుత్వం చెప్పేది అబద్దం: హర్షకుమార్ - బోటు ప్రమాదం
గోదావరిలో బోటు ప్రమాదంపై మరోసారి మాజీ ఎంపీ హర్షకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బోటులో ప్రయాణిస్తున్న వారు 93 మంది అని తెలిపారు.
ex_mp_harshakumar_comments_on_boat_accident
Last Updated : Sep 21, 2019, 6:51 PM IST