రాష్ట్రంలో వైకాపా పాలనపై తెదేపా నేత నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. కరోనాపై ఇతర రాష్ట్రాలు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నాయన్న ఆయన రాష్ట్రంలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందని విమర్శించారు. ఇసుక విధానంలో అవినీతి జరగుతుందని దుయ్యబట్టారు. ఇసుక దొరకడం లేదని సాక్షాత్తూ వైకాపా ఎమ్మెల్యేలే నిరసన వ్యక్తం చేశారన్న ఆయన.. ఇప్పుడు సీఎం జగన్కు భయపడి యూటర్న్ తీసుకున్నారన్నారు.
'జగన్కు భయపడి ఎమ్మెల్యేలు యూటర్న్ తీసుకున్నారు' - sand latest news in ap
వైకాపాపై తేదేపా నాయకుడు నిమ్మకాయల చినరాజప్ప మండిపడ్డారు. రాష్ట్రంలో ఇసుక కొరత ఉందన్న ఆయన.. ప్రభుత్వమే అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు.

వైకాపాపై నిమ్మకాయల చినరాజప్ప మండిపాటు