ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కాకినాడలో ఉత్సాహంగా సాగుతున్న 'ఈనాడు' క్రికెట్ పోటీలు - kakinada eenadu cricket news in telugu

కాకినాడలోని రంగరాయ వైద్య కళాశాల క్రీడా మైదానంలో 'ఈనాడు' క్రికెట్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి.

http://10.10.50.85:6060///finalout4/andhra-pradesh-nle/finalout/26-December-2019/5496617_kkd-cricket-2.mp4
పోటాపోటీగా తలపడుతున్న యువ క్రీడాకారులు

By

Published : Dec 26, 2019, 5:13 PM IST

కాకినాడలో ఉత్సాహంగా సాగుతున్న 'ఈనాడు' క్రికెట్ పోటీలు

కాకినాడ రంగరాయ వైద్య కళాశాల క్రీడా మైదానంలో 'ఈనాడు' క్రికెట్ పోటీలు ఉత్కంఠగా సాగుతున్నాయి. బిక్కవోలు శ్రీప్రజ్ఞ డిగ్రీ కళాశాల జట్టు, సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల జట్లు తలపడ్డాయి. ఇందులో ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల జట్టు విజయం సాధించింది. కోటనందూరు శ్రీచైతన్య డిగ్రీ కళాశాలతో జరిగిన పోటీలో... దివిలి కిట్స్ ఇంజినీరింగ్ కళాశాల జట్టు విజయం సాధించింది.

పెరుమాళ్లపురం ప్రభుత్వ కళాశాల, కాకినాడ ఐడియల్ పీజీ కళాశాల మధ్య జరిగిన మ్యాచ్​లో... ఐడియల్ కళాశాల జట్టును విజయం వరించింది. సూరంపాలెం ఆదిత్య గ్లోబల్ జట్టు, రామచంద్రపురం వీఎస్​ఎమ్​ డిగ్రీ కళాశాల జట్ల మధ్య జరిగిన మ్యాచ్​లో వీఎస్​ఎమ్​ డిగ్రీ కళాశాల జట్టు జయకేతనం ఎగరేసింది. రామచంద్రాపురం మోడ్రైన్​ లయన్​ జట్టు, వీఎస్​ఎమ్​ ఇంజినీరింగ్ కళాశాలల మధ్య జరిగిన మ్యాచ్​లో వీఎస్​ఎమ్​ ఇంజినీరింగ్ కళాశాల జట్టు విజయం సాధించింది.

ABOUT THE AUTHOR

...view details