ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్నికల లెక్కల్లో.. తూర్పుగోదావరి జిల్లా

సార్వత్రిక సమరానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. తూర్పు గోదావరి జిల్లాలో ఎన్నికల నిర్వహణకు యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. రాష్ట్రంలోనే అత్యధిక ఓటర్లు ఉన్న జిల్లా అయిన కారణంగా.. అంతే స్థాయిలో ప్రశాతంగా ఎన్నికల నిర్వహణకు సిబ్బంది సన్నద్ధయమయ్యారు.

తూర్పు గోదావరి జిల్లావ్యాప్తంగా ఎన్నికల సమరానికి సిద్దం.

By

Published : Apr 10, 2019, 7:36 PM IST

జిల్లాలో 19 శాసనసభ, 3 లోక్​సభ స్థానాలు ఉన్నాయి. శాసనసభకు 223 మంది, లోక్ సభకు 36 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. అత్యధిక సీట్లు, ఓట్లు ఉన్న కారణంగా ఎన్నికల నిర్వహణకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.

* జిల్లాలో 42 లక్షల 4 వేల 436 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు 20 లక్షల 80 వేల 751, మహిళా ఓటర్లు 21 లక్షల 23వేల 332 మంది ఉన్నారు. ఇతర ఓటర్లు 353 మంది ఉన్నారు. రంపచోడవరం నియోజకవర్గంలో అత్యధికంగా 2 లక్షల 60 వేల 323 మంది, రాజోలులో అత్యల్పంగా లక్షా 86 వేల 819 మంది ఓటర్లు ఉన్నారు.

* జిల్లాలో 4,581 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. 1437 సమస్యాత్మక కేంద్రాలు గుర్తించారు. నిర్వహణకు పోలింగ్ అధికారులు 5 వేల 39 మంది, సహాయ అధికారులు 5 వేల 39 మంది.. ఓఏవోలు, ఇతర సిబ్బంది 20 వేల 156 మంది వరకూ విధుల్లో భాగం కానున్నారు. సూక్ష్మ పరిశీలకులుగా 1580 మందిని నియమించారు. సంచార తనిఖీ బృందాలు, నియమావళి పర్యవేక్షణ బృందాలను నియమించారు.

* 15 కంపెనీల పారామిలటరీ బలగాలు, మూడు వేలకుపైగా జిల్లా పోలీసులు, ఏపీఎస్పీ బలగాలు, ఫ్లైయింగ్ స్కాడ్ బృందాలు పర్యవేక్షణ చేస్తున్నాయి.


ఇవీ చూడండి

పోలింగ్‌ కోసం ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు

ABOUT THE AUTHOR

...view details