ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఉద్ధృతంగా వరద నీరు... వంతెన నిర్మించండి సారూ - appanapalli

తూ. గో జిల్లా మామిడికుదురు మండలం అప్పన్నపల్లి కాజ్వేకు అవతల ఉన్న అప్పనపల్లి, బీర్ దొడ్డవరం, పెదపట్నంకు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కాజ్వే ముంపునకు గురవ్వటం వల్ల మూడు గ్రామాల ప్రజలు అతికష్టం మీద రాకపోకలు సాగిస్తున్నారు.

ఉద్ధృతంగా వరద నీరు... వంతెన నిర్మించండి సారూ

By

Published : Aug 9, 2019, 7:24 AM IST


గోదావరి వరద పోటెత్తటంతో తూర్పు గోదావరి జిల్లా మామిడికుదురు మండలం అప్పన్నపల్లి కాజ్వే మూడోసారి ముంపు బారిన పడింది. గోదావరి వరద నీరు ఉద్ధృతంగా పెరగిన కారణంగా... కాజ్వే కు అవతల ఉన్న అప్పనపల్లి, బీర్ దొడ్డవరం, పెదపట్నం ఇలా మూడు గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కాజ్వే మీద కాస్త తక్కువ వరద నీరు ఉండడంతో అతికష్టం మీద దాని మీద రాకపోకలు సాగిస్తున్నారు. ప్రభుత్వం తమ పరిస్థితిని అర్థం చేసుకుని... వంతెనను నిర్మించాలని కోరుతున్నారు.

ఉద్ధృతంగా వరద నీరు... వంతెన నిర్మించండి సారూ

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details