ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'అంతర్వేది ఘటనపై ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించవద్దు'

అంతర్వేది రథం దగ్ధం ఘటనపై రాష్ట్ర ప్రభుత్వమే ఉన్నత స్థాయి విచారణ జరిపి వాస్తవాలను బయటకు తీసుకురావాలి సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. దర్యాప్తు ఆలస్యం అయితే మతోన్మాద శక్తులకు అవకాశం ఇచ్చినట్లే అని మధు అన్నారు.

cpm madhu on antharvedi issue
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు

By

Published : Sep 11, 2020, 8:12 AM IST

అంతర్వేది రథం దగ్ధం ఘటన పలువురిని ఆందోళన పరుస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. సున్నితమైన ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించకూడదని స్పష్టం చేశారు. రథం దగ్ధంపై సీబీఐ విచారణకు ఆదేశించడం మంచిదేనన్న అయన సీబీఐ పేరుతో ఆలస్యం చేయకుండా రాష్ట్ర ప్రభుత్వమే ఉన్నత స్థాయి విచారణ వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలన్నారు.

రథం దగ్ధం అంశాన్ని అవకాశంగా తీసుకుని కొందరు మతాల మధ్య చిచ్చు పెట్టె కుట్రలు నివారించడానికి ప్రభుత్వం చురుకుగా వ్యవహరించడం ముఖ్యమని మధు పేర్కొన్నారు. ఈ దుర్ఘటన గురించి అన్ని విషయాలు వెలుగులోకి తేవడం ద్వారా విచ్ఛిన్న శక్తుల అట కట్టించాలని డిమాండ్ చేసారు. మతోన్మాద శక్తులు కుట్రల పట్ల ప్రజలు అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు.

ఇదీ చదవండి: అంతర్వేది ఘటనపై సీబీఐ దర్యాప్తునకు సీఎం నిర్ణయం

ABOUT THE AUTHOR

...view details