ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 27, 2020, 7:39 AM IST

ETV Bharat / state

వైద్యం కోసం 30 గంటల నిరీక్షణ

కరోనా బాధితులకు సరైన సమయానికి చికిత్స అందక వారు పడే బాధలు వర్ణనాతీతం. ఆస్పత్రుల్లో పడకలు దొరక్క, పడకలు ఉన్న వైద్యం అందించన కష్టాలు పడుతున్నారు. తాజాగా రాజమహేంద్రవరంలో జరిగిన ఘటనే అందుకు ఉదాహరణగా మారింది.

covid patients difficulties
వైద్యం కోసం 30 గంటల నిరీక్షణ

ముక్కులో ఆక్సిజన్‌ పైపు.. పక్కన సిలిండర్‌తో ఊపిరి కోసం ఆరాటపడుతున్న మహిళతో ఆమె భర్త, కుమార్తె తిరగని ఆసుపత్రి లేదు. అడగని సాయం లేదు. శనివారం మధ్యాహ్నం నుంచి అన్ని ఆసుపత్రులు తిరుగుతున్నా ఆదివారం రాత్రి 8 గంటల వరకు సరైన వైద్యం అందలేదు. ఇదీ రాజమహేంద్రవరంలోని జాంపేటకు చెందిన ఓ మహిళ జీవన్మరణ పోరాటం. ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతూ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్న ఓ మహిళను శనివారం మధ్యాహ్నం ఓ ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లగా అక్కడ సి.టి.స్కాన్‌ చేసి కొవిడ్‌ పాజిటివ్‌గా నిర్ధారించారు. పడకలు ఖాళీ లేకపోవడంతో తీసుకెళ్లిపోండని చెప్పడంతో మరో రెండు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లారు. అక్కడా పడకలు లేవనడంతో రాత్రి 12 గంటలకు సొంతంగా ఆక్సిజన్‌ సిలిండర్‌, నెబిలైజర్‌తో ఇంటికెళ్లిపోయారు.

ఆదివారం తెల్లవారుజాము నుంచి మళ్లీ ఆసుపత్రిలో పడక కోసం నగరంలోని కొవిడ్‌ ఆసుపత్రులకు తిరిగినా ఫలితం లేదు. చివరికి ప్రభుత్వ కొవిడ్‌ ఆసుపత్రికి తీసుకురాగా అక్కడా పడకలు లేక చక్రాల కుర్చీలో ఉంచి ఆక్సిజన్‌ అమర్చారు. ఐసీయూలో పడకలు ఖాళీ అయిన తరువాత అందులో చేర్చి మెరుగైన వైద్యం అందించారు. దీనిపై సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సోమసుందరరావును వివరణ కోరగా ఆక్సిజన్‌ సదుపాయం గల పడకలు నిండిపోవడంతో కొద్దిసేపు కుర్చీలో కూర్చోబెట్టి ఆక్సిజన్‌ ఇచ్చామని, ఐసీయూలో పడకలు ఖాళీ కాగానే అక్కడికి మార్చి వైద్య సేవలందిస్తున్నట్లు వివరించారు.

ఇదీ చదవండి: కష్టమంటే చాలు.. ఇంట్లో మనిషైపోతున్నాడు సోనూసూద్

ABOUT THE AUTHOR

...view details