ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ముమ్మిడివరంలో పెరుగుతున్న కరోనా కేసులు

జిల్లాలో కరోనా అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ప్రతీరోజు పాజిటివ్‌ కేసులు పెరుగుతున్నాయి. ముమ్మిడివరం నియోజకవర్గంంలో మొత్తం 8527 మందికి పరీక్షలు నిర్వహించగా...1631 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. కరోనా కారణంగా 15 మంది మృత్యువాత పడ్డారని...నియోజకవర్గ ఆరోగ్య శాఖ అధికారులు తమ నివేదికలో తెలిపారు.

Corona cases increasing in Mummidivaram east godavari dist
ముమ్మిడివరంలో పెరుగుతున్న కరోనా కేసులు

By

Published : Sep 14, 2020, 5:04 PM IST

తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలో నాలుగు మండలాల్లో నెలరోజుల్లో వెయికి పైనే కరోనా కేసులు నమోదు కావటంతో అధికారులు, ప్రజలను తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మొత్తం 8527 మందికి పరీక్షలు నిర్వహించగా...1631 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. తాళ్లరేవు మండలంలో 289 మందికి..ఐ.పోలవరం మండలంలో 318 మందికి... ముమ్మిడివరం మండలంలో 558 మంది.. కాట్రేనికోన మండలంలో 466 మందికి కరీనా సోకినట్లు నిర్ధారణ అయిందని మండల వైద్య అధికారులు తెలిపారు. కరోనా కారణంగా 15 మంది మృత్యువాత పడ్డారని నియోజకవర్గ ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.

గ్రామీణ ప్రాంతాల్లో వ్యాధి విస్తారంగా పెరగటానికి మాస్కులు, సామాజిక దూరం, శానిటైజర్ వాడటం వంటి విషయాలపై అలసత్వం వహించటమే కారణమని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి:

'కరోనా గురించి భయం వద్దు...'

ABOUT THE AUTHOR

...view details