కరోనా విజృంభణతో ఎల్కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులంతాఇంటికే పరిమితమయ్యారు. తూర్పుగోదావరి జిల్లాలోని కేంద్రపాలిత యానంలో కొంతమంది విద్యార్థులు కరోనా నుంచి రక్షణ పొందేందుకు వాడే శానిటైజర్..మాస్కులు తయారు చేసి ప్రజలకు అవగాహన కల్పించారు. మరికొంత మంది విద్యార్థులు తమలోని ఆలోచనలు చిత్రలేఖనం ద్వారా మరి కొంతమందికి అవగాహన కల్పిస్తున్నారు.
కాన్వాస్‌పై కరోనా బొమ్మ... చిన్నారుల సృజన అదిరిందమ్మ..
తూర్పుగోదావరి జిల్లా రాజీవ్ గాంధీ పాఠశాల విద్యార్థులు కరోనా మహమ్మారిపై సాగిస్తున్న పోరాటం చిత్రాల ద్వారా ఆవిష్కరించి అందరి మన్ననలు పొందుతున్నారు. వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బంది చేస్తున్న సేవలను మనసుకు హత్తుకునేలా చిత్రికరించారు.
కరోనాపై చిన్నారుల చిత్రలేఖనం..
రాజీవ్ గాంధీ పాఠశాల విద్యార్థులు కర్రి నూకరాజు, పాలెపు దుర్గాప్రసాద్లు కరోనా మహమ్మారిపై మూడు నెలలుగా సాగిస్తున్న పోరాటం చిత్రాల ద్వారా ఆవిష్కరించి అందరి మన్ననలు పొందుతున్నారు. కరోనా సోకిన వ్యక్తి సేవలు అందిస్తున్న వైద్య సిబ్బంది, పోలీస్ సిబ్బంది తమ ప్రాణాలను ఫణంగా పెట్టి ప్రజల ప్రాణాలు కాపాడేందుకు పారిశుద్ధ్య సిబ్బంది చేస్తున్న సేవలను ఈ విద్యార్థులు మనసుకు హత్తుకునేలా చిత్రించారు.