అక్రమంగా నాటుసారా తరలిస్తున్న ఇద్దరు యువకులను తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రత్తిపాడు మండలం పెద్దశంకర్లపూడి గ్రామానికి చెందిన సురేశ్, మురళి అనే యువకులు బైక్పై 100 లీటర్ల సారా తరలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు వారిని లింగంపర్తి వద్ద అడ్డుకున్నారు. నాటుసారాను స్వాధీనం చేసుకుని.. కేసు నమోదు చేసినట్లు ఎస్సై సుధాకర్ తెలిపారు.
100 లీటర్ల నాటుసారా స్వాధీనం.. ఇద్దరు యువకులు అరెస్ట్ - 100 లీటర్ల నాటుసారా స్వాధీనం
ద్విచక్రవాహనంపై తరలిస్తున్న 100 లీటర్ల నాటుసారాను తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు.
నాటుసారా రవాణా చేస్తూ పట్టుబడిన యువకులు
TAGGED:
100 లీటర్ల నాటుసారా స్వాధీనం