రావులపాలెంలో పోరాట యోధుల జయంతి - east godavari
తూర్పు గోదావరి జిల్లా కోనసీమ ముఖద్వారమైన రావులపాలెంలో వంగవీటి రంగా, అల్లూరి సీతారామరాజుల జయంతి కార్యక్రమాలు నిర్వహించారు.
ఘనంగా పోరాట యోధుల జయంతి
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు, కాపు పోరాట నేత వంగవీటి రంగా జయంతి వేడుకలను నిర్వహించారు. రావులపాలెంలోని అమలాపురం రోడ్డులో ఉన్న వంగవీటి రంగా విగ్రహానికి రాష్ట్ర కాపు జేఏసీ కన్వీనర్ ఆకుల రామకృష్ణ పూలమాలలు వేసి నివాళులర్పిచారు. జడ్పీ ఉన్నత పాఠశాల ప్రాంగణంలో ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహానికి గ్రామ పెద్దలు పూలమాలలు వేశారు.అనంతరం విద్యార్ధుల కోసం సేవ చేస్తున్న నందం సత్యనారాయణ, పడాల రామకృష్ణా రెడ్డిలను అల్లూరి సేవా సమితి సభ్యులు సత్కరించారు.