తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో నిర్వహించిన భాజపా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి మాజీ మంత్రి, భాజపా నేత మాణిక్యాలరావు హాజరయ్యారు. దేశంలో తొలిసారి భాజపా పాజిటివ్ ఓటుతో అధికారంలోకి వచ్చిందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు తాగునీటి సమస్యలు ఎదుర్కొంటున్నారనీ.. ఈ మేరకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టాలని సూచించారు. భాజపాలో చేరినప్పటికీ సీఎం రమేష్, సుజనా చౌదరి బ్యాంకులకు చెల్లించాల్సిన అప్పులపై ఉన్న కేసుల విచారణలో ఎలాంటి మార్పు ఉండబోదని అన్నారు. బడ్జెట్ కేటాయింపులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆదాయానికి, కేటాయింపులకు సంబంధం లేదని పెదవి విరిచారు.
రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీ: భాజపా
వైకాపా ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెల గారడీలా ఉందని మాజీ మంత్రి, భాజపా నేత మాణిక్యాలరావు విమర్శించారు. కేటాయింపులకు, ఆదాయానికి ఏ మాత్రం సంబంధం లేదన్నారు.
రాష్ట్ర బడ్జెట్ పై మాణిక్యాళరావు విమర్శ