తూర్పు గోదావరి జిల్లా తునిలో నిజాయితీకి మారుపేరుగా విధులు నిర్వహించే ఎస్సై అల్లు దుర్గారావు.. సహచర పోలీసులు, ఉన్నతాధికారుల వేధింపుల వలనే బలవన్మరణానికి పాల్పడిన పట్టణ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బోను నరేష్ ఖండించారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ నాయకుడు ఆర్ కృష్ణయ్య ఆదేశాలతో.. ఎస్సై దుర్గారావు మృతి ఘటనపై నిజనిర్థరణ కమిటీగా తునిలో పర్యటించినట్లు ఆయన వెల్లడించారు. ఉన్నతాధికారులు, సహచర ఉద్యోగుల వేధింపుల వలనే... దుర్గారావు ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా సమచారం సేకరించినట్లు తెలిపారు. ఘటనపై డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించాలని డిమాండ్ చేశారు.
'ఎస్సై ఆత్మహత్యపై డీజీపీ స్పందించాలి' - bc leaders on si suicide
బీసీ వర్గానికి చెందిన ఎస్సై అల్లు దుర్గారావు.. సహచర పోలీసులు, ఉన్నతాధికారుల వేధింపుల వలన బలవన్మరణానికి పాల్పడిన ఘటన పట్ల బీసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై డీజీపీ స్పందించాలని డిమాండ్ చేశారు.
బీసీ నాయకులు
ఎస్సై కుటుంబానికి ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలనీ.. దోషులను శిక్షించాలని కోరారు. ఘటనపై ప్రభుత్వం స్పందించకపోతే.. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీసీ సంఘ నాయకులతో దశలవారీగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.
ఇదీ చదవండి:అంతర్వేది నూతన రథం నిర్మాణ పనులు ప్రారంభం