ఆటోను ఢీకొన్న కారు.. నలుగురికి గాయాలు - ravulapalem
ఈతకోట వద్ద జాతీయ రహదారిపై ఆటోను కారు ఢీకొంది. ఘటనలో నలుగురికి గాయాలు కాగా వారిని దగ్గర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.
ఆటోను ఢీకొన్న కారు.. నలుగురికి గాయాలు
తూర్పుగోదావరి జిల్లా రావులపాలెం మండలం ఈతకోట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను కారు వెనుక నుండి వచ్చి ఢీకొట్టిన ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. వీరిని దగ్గర్లోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కొత్త పేట ఎమ్మెల్యే జగ్గిరెడ్డి బాధితులను ఆస్పత్రిలో పరామర్శించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.