తూర్పు గోదావరి జిల్లా రావులపాలెంలో వాలంటీర్లతో పాటు పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో వైకాపా నాయకులు తిరుగుతున్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్నాయి. ప్రభుత్వం ప్రతి నెల ఒకటో తేదీన వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పింఛన్ సొమ్ములను అందిస్తుంది.
ప్రస్తుత ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో వాలంటీర్లు ఒక్కరే వెళ్లి సొమ్ములు ఇవ్వాల్సి ఉండగా రావులపాలెంలోని పలు ప్రాంతాల్లో వైకాపా కార్యకర్తలు వారి వెంట వెళ్లారు. వీరు వెళ్ళిన వీడియోలను పలువురు సోషల్ మీడియాలో పెట్టారు.