ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 17, 2022, 9:00 AM IST

ETV Bharat / state

AP TOPNEWS ప్రధానవార్తలు@9am

..

9am topnews
ప్రధానవార్తలు9am

  • మాచర్లలో వైసీపీ నాయకుల అరాచకం.. టీడీపీ నాయకులపై రాళ్లతో దాడి
    పల్నాడు జిల్లా మాచర్లలో వైసీపీ..విధ్వంసానికి తెగబడింది. తెలుగుదేశం చేపట్టిన ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి.. నిరసనను అడ్డుకోవడంతో మొదలైన ఘర్షణ వాతావారణం.. చివరకు రణరంగంగా మారింది. ఈ క్రమంలో తెలుగుదేశం నేతలు, కార్యకర్తలు ఇలా.. దొరికినవారిపై ఇష్టారీతిన వైసీపీ నేతలు దాడులకు తెగబడ్డారు. తెలుగుదేశం పార్టీ కార్యాలయం, వాహనాలు, ఇళ్లు.. తగలబెట్టారు. పట్టణంలో భయనాక వాతావరణం సృష్టించారు. ప్రజలు బయటికి రావాలంటేనే భయపడిపోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మాచర్ల మంటలు.. సీఎం జగన్‌తో పాటు ఆయన ప్రభుత్వాన్ని దహించడం ఖాయం: చంద్రబాబు
    మాచర్లలో పోలీసుల సహకారంతో వైసీపీ రౌడీ మూకలు మరోసారి తెలుగుదేశం శ్రేణులపై దాడికి పాల్పడటం దారుణమని చంద్రబాబు మండిపడ్డారు. దాడి చేసిన వైసీపీ గూండాలను వదిలేసి తెలుగుదేశం కార్యకర్తల పై పోలీసులు లాఠీఛార్జ్ చెయ్యడం, జూలకంటి బ్రహ్మారెడ్డిని అదుపులోకి తీసుకోవడం అధికార పార్టీకి కొమ్ముకాయడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ గూండాలకు సహకరించిన పోలీసు సిబ్బంది, అధికారులపైనా చర్యలు తీసుకోవాలన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • మార్గదర్శిలో సోదాలకు అనుమతి లేదు: తెలంగాణ హైకోర్టు
    హైదరాబాద్‌లోని మార్గదర్శి చిట్ ఫండ్ ప్రధాన కార్యాలయంలో.. సోదాలు ఆపాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. విజయవాడ జిల్లా రిజిస్ట్రార్ జారీ చేసిన.. వారంట్ అమలును నిలిపివేస్తూ.. మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. మార్గదర్శి చందాదారుల వివరాలను కోరారని, ఇది వ్యక్తిగత గోప్యత హక్కుకు భంగమని.. అందువల్ల సోదాలను నిలిపివేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. దీనిపై తదుపరి పరిశీలన నిమిత్తం విచారణను ఈ నెల 23వ తేదీకి వాయిదా వేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఘోర అగ్నిప్రమాదం.. ఇంట్లో మంటలు చెలరేగి ఆరుగురు సజీవదహనం
    తెలంగాణలోని మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం వెంకటాపూర్‌లో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఇంట్లో మంటలు చెలరేగి యజమానితో పాటు ఆరుగురు సజీవ దహనమయ్యారు. మృతులు ఇంటి యజమాని శివయ్య(50), ఆయన భార్య పద్మ(45), పద్మ అక్క కుమార్తె మౌనిక(23), ఆమె ఇద్దరు కుమార్తెలతో పాటు.. మరో బంధువైన శాంతయ్యగా పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కృష్ణా జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ఇద్దరు మృతి, ముగ్గురు విద్యార్థులు గల్లంతు
    కృష్ణమ్మ గర్భంలో తీవ్ర విషాదం నెలకొంది. కృష్ణాజిల్లా యనమలకుదురు సమీపంలో శుక్రవారం సరదాగా ఈతకు దిగినవారిలో ఇద్దరు మృతిచెందగా, మరో ముగ్గురు గల్లంతయ్యారు. ఒక బాలుడిని మత్స్యకారుడు కాపాడగా, ఇంకొకరు ఒడ్డునే ఉండి ప్రాణాలు దక్కించుకున్నాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 12 ఏళ్ల విద్యార్థికి కార్డియాక్‌ అరెస్ట్‌.. స్కూల్‌ బస్సులోనే కుప్పకూలి..
    అప్పటిదాకా ఆడుతూ పాడుతూ తిరిగి, స్కూల్లో పాఠాలు విన్న ఆ బాలుడు ఒక్కసారిగా కుప్పకూలాడు. కార్డియాక్‌ అరెస్ట్‌కు గురవడంతో 12 ఏళ్లకే అతడికి నూరేళ్లు నిండాయి. ఈ హృదయ విదారక ఘటన మధ్యప్రదేశ్‌లో జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అమెరికా టార్గెట్​గా ఉత్తర కొరియా కీలక పరీక్ష.. కిమ్​ పర్యవేక్షణలోనే..
    ఉత్తర కొరియా శక్తిమంతమైన సరికొత్త వ్యూహాత్మక ఆయుధ తయారీ దిశగా ముందడుగు వేసింది. అమెరికా భూభాగాన్ని లక్ష్యంగా చేసుకుని ఓ కీలక పరీక్షను నిర్వహించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'ప్రపంచంలోని అంతర్జాతీయ తయారీ సంస్థలను భారత్​కు రప్పించాలి'
    ప్రపంచ దేశాల్లో నెలకొన్న ఆర్థిక మాంద్యంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్​ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచంలోని బహుళజాతి సంస్థలు భారత్‌కు వచ్చేలా వ్యూహాలు సిద్ధం చేయాలని భారత పరిశ్రమ సంఘాలకు సూచించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రెండో టెస్టుకు రోహిత్ రెడీ.. మరి తుది జట్టులో ఎవర్ని తప్పిస్తారో?
    బంగ్లాదేశ్‌తో జరిగిన రెండో వన్డేలో ఫీల్డింగ్‌ చేస్తూ గాయపడిన రోహిత్‌ శర్మ.. డిసెంబరు 22 నుంచి బంగ్లాతో ప్రారంభంకానున్న రెండో టెస్టుకు అందుబాటులో ఉండే అవకాశాలున్నాయి. త్వరలోనే రోహిత్‌ బంగ్లాదేశ్‌ చేరుకొని జట్టుతో కలిసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆసక్తికరంగా నాయికల ఎంపిక.. ఏ అందానికి అవకాశం దక్కేనో!
    తెలుగులో స్టార్​ హీరోల సరసన నాయికల ఎంపిక ఆసక్తికరంగా మారింది. అగ్ర తారల సినిమాలు ఎప్పుడు మొదలవుతాయో.. ఎప్పుడు విడుదలవుతాయో అంచనా వేయలేం. ఆ సినిమాలు ఎప్పుడు ఎలా ఎవరెవరి కలయికలతో ఖరారవుతాయో కూడా ఒక పట్టాన అర్థం కాదు. టాలీవుడ్‌ పలు కీలకమైన ప్రాజెక్టులకి రంగం సిద్ధమవుతున్న వేళ.. ఏ కథానాయికకి ఏ సినిమా సొంతం అవుతుందనేదే ఇప్పుడు సినీ ప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ABOUT THE AUTHOR

...view details