ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'రాజధాని రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు' - ap corporation chairmen on pawan

అసెంబ్లీలో సీఎం చేసిన మూడు రాజధానుల ప్రకటనతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్​లు ఆందోళన చెందుతున్నారని రాష్ట్ర కాపు కార్పొరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా అన్నారు. రాష్ట్ర పరిస్థితులపై జనసేనానికి అవగాహన లేదని... రాజకీయాలు మానేసి సినిమాలు చేసుకుంటే... అవి చూసి తాము ఆనందిస్తామన్నారు.

'రాజధాని రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు'
'రాజధాని రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు'

By

Published : Jan 3, 2020, 10:00 AM IST

'రాజధాని రైతులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయొద్దు'

తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్​ కల్యాణ్​లు రైతులను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తున్నారని రాష్ట్ర కాపు కార్పొరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా ఆరోపించారు. అమరావతిలో రైతులకు ఇబ్బంది కలిగించే పరిస్థితులు దయచేసి తీసుకురావద్దని సూచించారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల మీద పవన్​కు ఏమాత్రం అవగాహన లేదని... ఇకనైనా జనసేనాని నటనలు ఆపాలని ఎద్దేవా చేశారు. 16 నెలల జైలు అంటూ జగన్మోహన్ రెడ్డిని విమర్శించడమే కార్యక్రమంగా జనసేనాని పెట్టుకున్నారని ఆక్షేపించారు. రాజకీయాలను వదిలేసి సినిమాలు చేసుకుంటే మంచిదని ఆయన హితవు పలికారు.

ABOUT THE AUTHOR

...view details