ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భక్త జన సంద్రంగా.. అంతర్వేది - lord

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలో లక్ష్మీనరసింహ స్వామి కల్యాణోత్సవం వైభవంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు.

అంతర్వేది భక్తజన సంద్రం

By

Published : Feb 17, 2019, 4:14 PM IST

అంతర్వేదిలో వేడుకగా స్వామివారి కల్యాణం
తూర్పుగోదావరిజిల్లా అంతర్వేది భక్త జన సంద్రంగా మారింది. స్వామి వారి కల్యాణానికి వివిధ ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చారు. గరుడ వాహనంపై స్వామి వారు పెళ్లి కుమారునిగా ఊరేగుతూ మంటపానికి చేరుకున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు స్వామి వెంట తరలివచ్చారు. ప్రభుత్వం తరుపున హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ప్రభుత్వం తరుపున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. అనంతరం స్వామి వారి కల్యాణ మహోత్వం నయన మనోహరంగా జరిగింది. భక్తులు సముద్రంలో పుణ్యస్నానాలు ఆచరించారు. స్వామి దర్శనానికి బారులు తీరారు. సాయంత్రం స్వామివారు గజవాహనం, రాత్రికి పొన్న వాహనంపై ఊరేగుతూ భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఇవి కూడా చదవండి.

ABOUT THE AUTHOR

...view details