తూర్పుగోదావరి జిల్లా అన్నవరం సత్యనారాయణ స్వామి వారికి హుండీ ఆదాయం 24 రోజులకు గాను కోటీ 6లక్షల రూపాయల ఆదాయం సమకూరింది. ఈవో త్రినాథరావు సమక్షంలో హుండీలను తెరిచి లెక్కించారు. విదేశీ కరెన్సీ, 19 గ్రాముల బంగారం, 658 గ్రాముల వెండి సమకూరిందని అధికారులు తెలిపారు. 44వేల రూపాయల విలువైన రద్దైన పాత 500,1000 నోట్లు వచ్చినట్టు వివరించారు.
అన్నవరం హుండీలో...రద్దైన నోట్లు - rajamahendravaram
అన్నవరం సత్యనారాయణస్వామి వారి హుండీని అధికారులు లెక్కించారు. 24 రోజులకు గాను కోటీ 6లక్షల రూపాయలు ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు తెలిపారు. హుండీలో రద్దైన పాతనోట్లు వచ్చాయన్నారు.
హుండీ లెక్కింపు