ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే రీతిలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోందని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. అమరావతి రైతులు చేపడుతున్న జనభేరి కార్యక్రమంలో పాల్గొనకుండా స్థానిక నేతలు, కార్యకర్తలను గృహ నిర్భంధించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా రామవరంలోని రామకృష్ణారెడ్డి ఇంటివద్దే అమరావతికి మద్దతుగా నిరసన కార్యక్రమం చేపట్టారు. ఒకే రాష్ట్రం-ఒకే రాజధాని అంటూ నినాదాలు చేశారు.
'ప్రాథమిక హక్కులకు భంగం కలిగేలా ప్రభుత్వం వ్యవహరిస్తోంది' - east godavari district news today
అమరావతి రైతులు చేపట్టిన జనభేరిలో పాల్గొనకుండా తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డిని పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఈ ఘటనపై రామకృష్ణారెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ... రాష్ట్రంలో ప్రాథమిక హక్కులకు భంగం కలిగించే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు.
అనపర్తి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి గృహనిర్బంధం