తూర్పుగోదావరి జిల్లా పసలపూడి గ్రామానికి చెందిన కర్రి సుబ్బారెడ్డి ప్రభుత్వ పాఠశాలలో ఆదివారం గణతంత్ర వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు. ఇటీవల ప్రభుత్వం అందించిన అమ్మఒడి నగదులో కొంత మొత్తాన్ని పాఠశాల అభివృద్ధికి విరాళంగా అందించారు విద్యార్థుల తల్లిదండ్రులు. ఆ నగదును పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పనకు ఉపయోగిస్తామని ప్రధాన ఉపాధ్యాయురాలు మాణిక్యాంబ తెలిపారు.
అమ్మఒడి నగదు పాఠశాలకు విరాళం - amma vodi amount donation in east godavari
అమ్మఒడి పథకం ద్వారా ప్రభుత్వం ఇచ్చిన నగదులో రూ.1000 చొప్పున తమ పిల్లలు చదువుతున్న పాఠశాలకు విరాళంగా అందించారు ఆ విద్యార్థుల తల్లిదండ్రులు. పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు తమ వంతుగా ఈ సాయం చేశామన్నారు. నిన్న జరిగిన గణతంత్ర వేడుకల్లో ఉపాధ్యాయులకు నగదు అందించారు.
అమ్మఒడి నగదు పాఠశాలకు విరాళం