ETV Bharat / city

రేషన్‌ కార్డులు, పింఛన్లలో అనర్హుల గుర్తింపు - వైఎస్సార నవశకం పై వార్తలు

రేషన్‌ కార్డులు, పింఛను లబ్ధిదారుల వడపోత మొదలైంది. అనర్హులుగా గుర్తించిన వారి వివరాల పరిశీలనలో గ్రామ సచివాలయ ఉద్యోగులు నిమగ్నమయ్యారు. పంచాయతీ/వార్డుల వారీగా ఇప్పటికే జాబితాలు విడుదల చేశారు. సోమవారం వరకు అభ్యంతరాలను స్వీకరించి.. మంగళవారం గ్రామ సభల్లో చదివి.. బుధవారమే తుది జాబితాను ప్రకటించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతా హడావుడిగా చేస్తుండటంతో తమ పేర్లు ఉన్నాయా? లేవా? అనే ఆందోళన లబ్ధిదారుల్లో వ్యక్తమవుతోంది.

YSR nava shakam filteration starts
వైఎస్సార్‌ నవశకం... ప్రారంభమైన వడపోత
author img

By

Published : Jan 27, 2020, 7:06 AM IST

వైఎస్సార్‌ నవశకం కార్యక్రమంలో భాగంగా సంక్షేమ పథకాలకు అర్హుల్ని గుర్తించే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టింది. ప్రతి పథకం లబ్ధిదారు వివరాలను గ్రామ వాలంటీర్లకు ఇచ్చి సర్వే చేయించింది. అనర్హుల జాబితాలను సిద్ధం చేయించింది. 13 జిల్లాల్లో 1.47 కోట్ల కుటుంబాలకు రేషన్‌ కార్డులుండగా.. 15.83 లక్షల కుటుంబాలవారు అనర్హులని గుర్తించారు. 52.18 లక్షల మంది పింఛనుదారుల్లో 4.52 లక్షల మందిని అర్హులు కాదని తేల్చారు. గ్రామాలవారీగా మరోసారి పరిశీలన చేయించి.. సామాజిక తనిఖీల ద్వారా జనవరి నెలాఖరుకు తుది జాబితాలను సిద్ధం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

కొరవడిన ప్రచారం

లబ్ధిదారుల వడపోతలో భాగంగా.. గ్రామ/వార్డు సచివాలయాల వారీగా అనర్హుల జాబితాలను ఈ నెల 23న ప్రదర్శించి.. 27దాకా అభ్యంతరాలను స్వీకరించాలని నిర్ణయించారు. కొత్త కార్డులు, పింఛన్లకు నమోదు చేసుకున్న వారి వివరాలనూ ఇందులో ప్రదర్శిస్తారు. అయితే అధిక శాతం గ్రామాల్లో జాబితాలను శుక్ర, శనివారాల్లో అంటించారు. దీనిపై ప్రచారమూ చేయలేదు. ఆదివారం సెలవు కావటంతో సచివాలయ సిబ్బంది అందుబాటులో లేరు. ఇక మంగళవారం గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు, బుధవారమే అర్హులతో తుది జాబితాలను వెల్లడించనున్నట్లు అధికారులు వివరిస్తున్నారు.
అర్హులని నిరూపించుకుంటేనే..
జాబితాల్లో పేర్లున్నవారు.. తాము అర్హులని నిరూపించుకునే ఆధారాలను సమర్పించాలి. వాటిని గ్రామ వాలంటీరు ద్వారా పరిశీలన చేయించి ఆన్‌లైన్లో అప్‌లోడ్‌ చేయిస్తేనే జాబితాలో పేరు నమోదవుతుంది. ఫిబ్రవరి 1 నుంచి బియ్యం, పింఛన్లను అందిస్తారు. ఇదంతా 3, 4 రోజుల్లోనే పూర్తి చేయాల్సి ఉండటంతో.. లబ్ధిదారుల్లో ఆందోళన కనిపిస్తోంది. ఎక్కువ మొత్తంలో విద్యుత్తు బిల్లులు, భూమి లెక్కల్లో తేడాలు, వాహనాల వివరాల నమోదులో తప్పులు దొర్లితే వాటిని సరిదిద్దుకోవడం ఎలా అనే ప్రశ్న వ్యక్తమవుతోంది. అందుకే కొంత సమయం ఇవ్వాలని కోరుతున్నారు.

ఇదీ చదవండి: నేడు మంత్రివర్గ సమావేశం... మండలి రద్దుపై తీర్మానం!

Intro:Body:

eenadu ration cards story

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.