ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'విద్యాశాఖ అసంబద్ధ విధానాలను విడనాడాలి'

విద్యా శాఖ రాష్ట్ర స్థాయిలో తీసుకుంటున్న అసంబద్ధ విధానాల వల్ల ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని.. వాటిని విడనాడాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు డి.వెంకట్రావు కోరారు.

Absurd policies should be abandoned
అసంబద్ధ విధానాలను విడనాడాలి

By

Published : Jan 25, 2021, 10:22 AM IST

విద్యాశాఖ రాష్ట్ర స్థాయిలో తీసుకుంటున్న అసంబద్ధ విధానాల వల్ల ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారని.. వాటిని విడనాడాలని ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు డి.వెంకట్రావు కోరారు. రావులపాలెంలో ఆదివారం ఎస్టీయూ 74వ కౌన్సిల్‌ సమావేశాలను నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వెంకట్రావు, రాష్ట్ర అసోసియేట్‌ అధ్యక్షుడు పి.వి.ఎస్‌.రామారావు, ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి గంధం నారాయణరావు హాజరయ్యారు.

ఇటీవల కాలంలో మృతిచెందిన అయిదుగురు సంఘ సభ్యులకు ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున చెక్కులను అందించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.వి.శేఖర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి శివప్రసాద్‌, రాష్ట్ర ఉపాధ్యక్షుడు కె.వి.వి.సత్యనారాయణ, కన్వీనర్‌ పల్లంరాజు తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details