ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యానాంలో పురాతన చర్చికి పూర్వ వైభవం - cherch latest news in yanam

160 ఏళ్ల నాటి చర్చి తుపాన్లు, భారీ వర్షాల కారణంగా శిథిలావస్థకు చేరుకుంది. పుదుచ్చేరి ప్రభుత్వం టూరిజం ప్రాజెక్టులో భాగంగా ఇప్పుడా ప్రార్థనా మందిరానికి పూర్వవైభవం తీసుకొచ్చింది.

160 years old cherch opening in yanam, puduchhery
పూర్వ వైభవంతో సరికొత్తగా..!

By

Published : Jan 5, 2020, 7:41 PM IST

పూర్వ వైభవంతో సరికొత్తగా..!

కేంద్రపాలిత ప్రాంతమైన యానాంలో నూట అరవై ఏళ్ళ క్రితం ఫ్రెంచి వారు రోమన్ క్యాథలిక్ చర్చి నిర్మించారు. తుపాన్లు, భారీ వర్షాల కారణంగా చర్చి శిథిలావస్థకు చేరింది. పుదుచ్చేరి ప్రభుత్వం టెంపుల్ టూరిజం ప్రాజెక్టులో భాగంగా కోటి రూపాయలతో మరమ్మతులు చేపట్టి.. ఆ ప్రార్థనా మందిరానికి తిరిగి పూర్వ వైభవం తీసుకు వచ్చింది. ఈ చర్చిలో ఏసుక్రీస్తు శిలువ వేయబడిన సంఘటన సంబంధించి చెక్కతో తయారు చేసిన రూపాలు నేటికీ చెక్కు చెదరలేదు. దీనిని విశాఖపట్నంకు చెందిన బిషప్ ప్రకాష్​తో కలిసి పుదుచ్చేరి పర్యాటక శాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు ప్రారంభించారు. ఈ ప్రార్థన మందిరానికి కులమతాలకు అతీతంగా రాష్ట్రంలో వివిధ ప్రాంతాల నుంచి ప్రతి ఏటా అధిక సంఖ్యలో పర్యటకులు వచ్చి సందర్శిస్తుంటారు.

ABOUT THE AUTHOR

...view details