దేవాలయాల్లా భావించే చట్టసభల్లో వైకాపా నాయకుల తీరు చూస్తుంటే రాష్ట్రంలో రౌడీయిజం ఏ స్ధాయిలో ఉందో అర్ధమవుతుందని చిత్తూరు జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి, తుడా మాజీ ఛైర్మన్ నరసింహయాదవ్ అగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల, అనగారిన వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న తెదేపా నాయకులపై కేసులు పెట్టటం దారుణమన్నారు. రాజకీయాల్లో మచ్చలేని నేతగా పేరుగాంచిన అచ్చెన్నాయుడు, అయ్యన్న పాత్రుడు లాంటి నాయకులపై రాష్ట్రప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తప్పుడు కేసులు బనాయించిందన్నారు.
'అసెంబ్లీలో వైకాపా తీరు రౌడీయిజాన్ని తలపిస్తోంది'
అసెంబ్లీలో వైకాపా తీరును చిత్తూరు జిల్లా తెదేపా ప్రధాన కార్యదర్శి, తుడా మాజీ ఛైర్మన్ నరసింహయాదవ్ తప్పుపట్టారు.రౌడీయిజం రాష్ట్రంలో ఏ స్థాయిలో ఉందో వైకాపా నాయకుల తీరు చూస్తే అర్థమవుతుందన్నారు.
tuda ex chairmen fired on behavior of ycp leaders in assembly