ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Tirupathi: తిరుపతి గోశాల పనులను పరిశీలించిన తితిదే ఈవో - TTD news

తిరుప‌తి శ్రీ వేంక‌టేశ్వర గోసంర‌క్షణ‌శాల‌లో అభివృద్ధి ప‌నుల‌ను తితిదే ఈవో జ‌వ‌హ‌ర్‌రెడ్డి పరిశీలించారు. గోశాల‌ ప్రవేశంలో ఏర్పాటు చేసిన ఆర్చి, రహదారులను ప‌రిశీలించి ప‌లు మార్పులను సూచించారు.

జ‌వ‌హ‌ర్‌రెడ్డి
తితిదే ఈవో
author img

By

Published : Jun 30, 2021, 10:33 PM IST

తిరుప‌తి శ్రీ వేంక‌టేశ్వర గోసంర‌క్షణ‌శాల‌లో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నుల‌ను తితిదే ఈవో జ‌వ‌హ‌ర్‌రెడ్డి త‌నిఖీ చేశారు. స్వామివారికి వాడిన పుష్పాలు, పంచ‌గ‌వ్యాల‌తో కూడిన మిశ్రమంతో అగ‌ర‌బ‌త్తీలను త‌యారు చేసేందుకు నిర్మిస్తున్న షెడ్డు, ప‌శువుల దాణా గోదామి, దాణా మిక్సింగ్ ప్లాంటుల‌ను ప‌రిశీలించారు.

గోశాల‌ ప్రవేశంలో ఏర్పాటు చేసిన ఆర్చి, రహదారులను ప‌రిశీలించి ప‌లు మార్పులను సూచించారు. గోశాలలో ప‌శువుల సంఖ్య‌, వాటికి అందిస్తున్న దాణా వివ‌రాలు గోశాల డైరెక్టర్ డాక్టర్ హ‌రినాథ‌రెడ్డి.. ఈవోకు వివ‌రించారు.

ఇదీ చదవండి:TTD: శ్రీవారికి రూ.కోటి విలువైన గో ఆధారిత పంట ఉత్పత్తుల వితరణ

ABOUT THE AUTHOR

author-img

...view details