ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జిల్లాలో కొత్తగా జాయింట్ కలెక్టర్ల వ్యవస్ధ - Joint collectors in chittoor

రాష్ట్రంలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు, నియామకాలను చేపడుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకుగానూ రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా జిల్లాలో జాయింట్‌ కలెక్టర్ల వ్యవస్థను తీసుకొచ్చింది. నూతన వ్యవస్థకు అనుగుణంగా ప్రభుత్వం నియామకాలు చేపట్టింది. రైతు భరోసా, రెవెన్యూ.. ఆసరా, సంక్షేమం.. గ్రామ,వార్డు సచివాలయాలు, అభివృద్ధి విభాగాలకు ప్రత్యేకంగా జాయింట్‌ కలెక్టర్లను నియమించింది.

jcs-for-chittor
jcs-for-chittor

By

Published : May 11, 2020, 6:04 PM IST

చిత్తూరు జిల్లాలో రైతు భరోసా, రెవెన్యూ జిల్లా జేసీగా మార్కండేయులును కొనసాగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. గ్రామ/వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా వి.వీరబ్రహ్మం(2015 ఐఏఎస్‌ కేడర్‌) నియమించింది.

జిల్లాలో నాన్‌కేడర్‌లోని జేసీ-2 పోస్టులను.. జేసీ పోస్టుగా పునర్‌ వ్యవస్థీకరించారు. తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు అన్ని జిల్లాల్లోని జేసీ-2లను ఆసరా, సంక్షేమ శాఖల జేసీలుగా కొనసాగించనున్నట్లు ఆ ఉత్వర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం జేసీ-2గా ఉన్న చంద్రమౌళి ఆసరా, సంక్షేమ జేసీగా కొనసాగనున్నారు. మదనపల్లె సబ్‌కలెక్టర్‌గా ఉన్న కీర్తి చేకూరిని తూర్పుగోదావరి జేసీగా నియమిస్తూ బదిలీ చేశారు.

గ్రామ/వార్డు సచివాలయాలు, అభివృద్ధి జేసీగా జిల్లాలో పోస్టింగ్‌ దక్కడం ఎంతో ఆనందంగా ఉందని వి.వీరబ్రహ్మం అన్నారు. గతంలో తిరుపతి ఆర్డీవోగా పనిచేసిన అనుభవం ఉందన్నారు. మళ్లీ జిల్లాలో పనిచేసే అవకాశం దక్కడాన్ని చాలా అదృష్టంగా భావిస్తున్నానన్నారు. జిల్లా కలెక్టర్‌ నేతృత్వంలో అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేసేందుకు కృషిచేస్తానని వీరబ్రహ్మం తెలిపారు.

ఇదీ చదవండి:

విశాఖలో కేంద్ర నిపుణుల బృందం పర్యటన

ABOUT THE AUTHOR

...view details