తిరుమలలో మూడు రోజులుపాటు జరిగిన పవిత్రోత్సవాలు ఘనంగా పూర్ణహూతితో ముగిశాయి. సంపంగి ప్రాకారంలోని కల్యాణమండపంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనంను నిర్వహించారు. పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపుతో అభిషేకించి చివరగా చందనం పూత పూశారు. ధూపదీప హారతులు సమర్పించారు. సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు తిరువీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం ఆలయంలోని యాగశాలలో పూర్ణాహూతిని నిర్వహించారు.
శ్రీవారి సన్నిధిలో ముగిసిన పవిత్రోత్సవాలు
చిత్తూరు జిల్లా తిరుమల శ్రీవారి ఆలయంలో మూడురోజుల పాటు నిర్వహించిన పవిత్రోత్సవాలు పూర్ణాహూతితో ముగిశాయి.
పవిత్రోత్సవాలు