Tension over removed Ambedkar photo Frame in Chittoor district: అంబేడ్కర్ చిత్రపటం తొలగింపు చిత్తూరు జిల్లాలో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. రామకుప్పం మండలంలోని శివాజీ నగర్లో ఓ స్థూపంపై ఏర్పాటు చేసిన అంబేడ్కర్ చిత్రపటాన్ని మంగళవారం అర్థరాత్రి తొలగించారు. ఈ ఘటనను నిరసిస్తూ.. దళితులు ఆందోళనకు దిగారు. తొలగించిన చిత్రపటాన్ని తిరిగి పెట్టడానికి దళితులు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో దళితులు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది.
దీనికి నిరసనగా.. తెల్లవారుజాము 3 గంటల నుంచి ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ తోపులాటలో ఓ మహిళ స్పృహతప్పి పడిపోయారు. అంబేడ్కర్ చిత్రపటాన్ని తొలగించడాన్ని నిరసిస్తూ.. పోలీసులు, తహసీల్దార్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ అందోళన కొనసాగించారు.