తిరుమల శ్రీవారిలో తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్, సినీ నటులు మోహన్ బాబు, మంచు లక్ష్మి, సినీ నిర్మాత రాఖేష్ రెడ్డి పాల్గొన్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామి వారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు.. ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు.. - తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మంచు ఫ్యామిలీ
తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో తెలంగాణ రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్, సినీ నటుడు మోహన్ బాబు, మంచు లక్ష్మి, నిర్మాత రాఖేష్రెడ్డి స్వామి వారి సేవలో పాల్గొన్నారు.
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు
ఈ సందర్భంగా తెలంగాణ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. తెలంగాణ భాజపా నాయకులు స్థాయికి మించి మాట్లాడుతున్నారంటూ విమర్శలు గుప్పించారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన మోహన్ బాబు.. తిరుమలలో అవినీతికి చోటు లేకుండా అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు.
ఇదీ చదవండి:శ్రీవాణి ట్రస్టుకు పెరుగుతున్న విరాళాలు... ధార్మిక కార్యక్రమాలకు తితిదే యోచన
Last Updated : Jan 14, 2021, 10:32 AM IST