కరోనా లాక్ డౌన్ సమయంలో ప్రభుత్వం మద్యం దుకాణాలను తెరవడాన్ని నిరసిస్తూ తెదేపా మహిళ విభాగం ఆధ్వర్యంలో చిత్తూరులో ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టారు. మద్యం బాటిళ్లను పగులగొట్టి నిరసన తెలిపారు. తెలుగు మహిళ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో మద్యం దుకాణాలను తెరవడం సరికాదన్నారు.
'ప్రజల ప్రాణాల కన్నా ఆదాయమే ముఖ్యమా' - చిత్తూరులో తెలుగు మహిళల నిరసన
ప్రభుత్వం మద్యం దుకాణాలను తెరచి ప్రజల ప్రాణాలు లెక్కచేయకుండా.. ఆదాయమే పరమావధిగా ముందుకెళ్తోందని.. తెలుగు మహిళ నాయకులు విమర్శించారు. చిత్తూరులో మద్యం దుకాణాలకు వ్యతిరేకంగా నిరసన దీక్ష చేపట్టారు.
చిత్తూరులో తెలుగు మహిళల నిరసన
షాపుల వద్ద జనం భౌతిక దూరం పాటించకుండా క్యూ కడుతున్నారని .. దీంతో వైరస్ వ్యాప్తి ఎక్కువయ్యే ప్రమాదముందన్నారు. ప్రజల ప్రాణాలు లెక్క చెయ్యకుండా ఆదాయమే ముఖ్యమనే విధంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని దుయ్యబట్టారు. మహిళా నాయకుల నిరాహార దీక్షకు ఎమ్మెల్సీ దొరబాబు సంఘీభావం తెలిపారు.
ఇవీ చదవండి... 600 ఏళ్లలో తొలిసారిగా జాతర నిర్వహించట్లేదు!